Header Ads Widget

Responsive Advertisement

ఒక రాజకీయ పార్టీ రెండుగా చీలిపోయినట్లయితే.. ప్రస్తుత ఎన్నికల చిహ్నాన్ని ఏ వర్గానికి కేటాయిస్తారు? (అక్టోబర్ 10, 2022)

If a political party splits into two, the current election symbol will be assigned to which party? (October 10, 2022 - Current Affair)

 ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ఎన్నికలలో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు. అయితే అటువంటి పార్టీలు అన్నిటికీ కూడా ఒక ఎన్నికల చిహ్నాన్ని కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.


 అందుకనే దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీని చూసినా కూడా ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఎన్నికల గుర్తు అంటూ ఉంటుంది. ఆ ఎన్నికల గుర్తు ద్వారా ఈ రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఆ గుర్తు గురించి చెప్పి.. ఆ గుర్తుకు ఓటు వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.


అయితే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే రాజకీయ పార్టీ ఏర్పాడ్డ తర్వాత ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకున్న తర్వాత కొన్ని కారణాల వలన ఒకవేళ ఆ పార్టీ గనుక రెండుగా చీలిపోతే రెండు వర్గాలకు ఒక్కొక్కరు అక్కడ నాయకత్వం వహిస్తారు. మరి ఆల్రెడీ ఒక పార్టీకి ఒక ఎన్నికల గుర్తు కేటాయించారు కదా? మరి ఏ వర్గం అసలైన వర్గం? ఇప్పుడు ఉన్న అనగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల గుర్తును ఏ వర్గానికి కేటాయించాలి? అన్న నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు అంటే.. దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. అప్పుడు ఈ పార్టీ ఈ విధంగా రెండుగా విడిపోయినప్పుడు.. రెండు వర్గాలు కూడా ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తాయి.

  •  తమ వర్గాన్ని అసలైన పార్టీగా గుర్తిస్తూ.. ఒరిజినల్ గా పార్టీ సింబల్ ఏదైతే ఉందో.. అది మాకు కేటాయించండి అని కోరడం జరుగుతుంది.


ఎన్నికల సంఘం రకరకాల అంశాలను పరిశీలించిన తర్వాత అసలు ఎన్నికల గుర్తు ఏ వర్గానికి ఇవ్వాలి అనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. కానీ ఒకవేళ ఎన్నికల సంఘం గనుక మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది అని భావించినప్పుడు ఎన్నికల సంఘం ఆ పట్టుకులర్ గుర్తును ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేయడం అంటే ఇక్కడ ఉన్న రెండు వర్గాలు కూడా ఆ ఎన్నికల చిహ్నాన్ని వాడుకోవడానికి వీలు లేదు.


మరి ఆ సమయంలో ఒకవేళ ఎన్నికలు వస్తే ఎలా? అటువంటి పరిస్థితే వచ్చింది మహారాష్ట్ర. మహారాష్ట్రలో మనకు తెలుసు శివసేన పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ప్రస్తుతం శివసేన పార్టీ మరియు భాజపా రెండు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు శివసేన మరియు కాంగ్రెస్ పార్టీ అలాగే NCP కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. ఉద్దవ్ ఠాక్రే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

  • అయితే ఆ శివసేన పార్టీలో చీలిక రావడం వలన, ఒక వర్గానికి ఏక్నాద్ షిండే వారు నాయకత్వం వహిస్తూ.. వారికి మెజారిటీ ఉంది అని నిరూపించుకుని.. వారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో కొనసాగుతున్నారు.


 ఇక శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది కాబట్టి, రెండు వర్గాల వారు కూడా తమ ఒరిజినల్ ఎన్నికల చిహ్నం!! ఏమిటి ఆ చిహ్నం?

  • విల్లు మరియు బాణం


 విల్లు మరియు బాణం వారి చిహ్నం కాబట్టి  ఆ చిహ్నాన్ని రెండు వర్గాల వారికి కేటాయించమని వారు కోరడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయాన్ని మరింతగా పరిశీలించాలి అని ప్రస్తుతానికి ఆ అంశాన్ని ఫ్రీజ్ చేయడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అతి త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది.

  • ఆ ఉప ఎన్నికలో ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న శివసేన వర్గం అక్కడి నుంచి పోటీ చేయలేని భావిస్తుంది. ✅️

  • ఏక్నాద్ షిండే నాయకత్వంలో ఉన్న శివసేన వర్గం పోటీ చేయాలి అని అనుకోవడం లేదు. ❌️


 ఎందుకు అంటే ఆ స్థానం నుంచి బిజెపి వ్యక్తి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఏక్నాద్ షిండే యొక్క శివసేన వర్గం బిజెపికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వారికి ఇబ్బంది లేదు. బిజెపి వారి పార్టీ సింబల్ మీద వారు పోటీ చేయడం జరుగుతుంది. మరి ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న శివసేన ఈ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో.. అది ఎలా? ప్రస్తుతం ఎన్నికలలో పాల్గొనాలి అంటే ఒక చిహ్నం కావాలి కాబట్టి దాంట్లో ఏదైనా ఒక చిహ్నాన్ని కేటాయించండి అని.. ఒక మూడు చిహ్నాలలో ఏదో ఒక చిహ్నాన్ని కేటాయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది.


 ఇక అతి త్వరలో దానిమీద ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ పరంగా కావలసింది ఏమిటి అంటే

  • ఎన్నికల చిహ్నాన్ని కేటాయించేది ఎవరు?

  •  రద్దు చేసేది ఎవరు?

  •  ఫ్రీజ్ చేసేది ఎవరు?

  •  ఒకవేళ చీలిక గనక ఏర్పడితే ఏ వర్గానికి ఆ గుర్తును కేటాయించాలి అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? అన్నీ కూడా ఎన్నికల సంఘానికి ఉంది.


 అదేవిధంగా ఎన్నికలలో మనం చూస్తూ ఉంటాము స్వతంత్రంగా ఎన్నికలలో పోటీ చేసే వారికి కూడా ఎన్నికల గుర్తు అనేది ఉంటుంది. దానిని కేటాయించే అధికారం కూడా ఎన్నికల సంఘానికే ఉంటుంది. అక్కడ ఫ్రీ సింబల్స్ అని ఉంటాయి. దాంట్లో నుంచి ఒక గుర్తును ఈ స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు ఈ ఎన్నికల సంఘం అనేది కేటాయించడం జరుగుతుంది.


 అదేవిధంగా ప్రస్తుతం మనం తెలంగాణలో చూస్తే టిఆర్ఎస్ పేరు కాస్త బిఆర్ఎస్ గా పేరు మార్చమని ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పెట్టడం అంటూ జరిగింది. మరి టిఆర్ఎస్ ఎన్నికల చిహ్నం ఏమిటి – కారు. BRS కు కూడా కారు చిహ్నం కావాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం దానిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరి వద్దనుండి ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఆ TRS ను BRS గా మారుస్తూ.. TRS కు ఉన్న కార్ సింబల్ను BRS కు కూడా కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఎన్నికల సంఘానికి ఉంది.


 Also Read |  Newly allotted Shiv Sena symbol and its historical significance

 మరి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మీద కోర్టుకు వెళ్లవచ్చునా?


 ఏ అంశానికి సంబంధించి ఐనా కూడా కోర్టుకు వెళ్ళవచ్చును. కానీ కోర్టుకు వెళ్లే కంటే ముందు నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం ఒకచోట ఉంది కాబట్టి.. మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం అది ఎన్నికల సంఘం కాబట్టి ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు ఉంటాయి. ఒకవేళ ఏ వర్గమైనా, ఒకవేళ ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం యొక్క నిర్ణయం మీద సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు వారు కోర్టు మెట్లు ఎక్క వచ్చును. 


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు