Header Ads Widget

Responsive Advertisement

రాజ్యసభలో నిర్ణాయక ఓటు ఎవరు వినియోగించుకుంటారు? Casting Vote In Rajya Sabha

పార్లమెంట్ ప్రక్రియలో భాగంగా మనం equality of votes అని మనం చాలా సార్లు వింటూ ఉంటాము.  Equality Of Votes అంటే ఓట్లు సమానంగా రావడం. అంటే ఏమిటి అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లు పాస్ అవ్వాలా లేదా అనేది ఓటింగ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది దానిని సపోర్ట్ చేస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది. లేదా ఆ బిల్లు తిరస్కరణకు గురి అవుతుంది.    కొన్ని సందర్భాలలో ఈ ఓట్లు అవును అన్నవారు అదేవిధంగా కాదు అన్నవారు ఇద్దరూ కూడా సమానంగా ఉన్నప్పుడు దాన్ని ఈ Equality Of Votes అంటాం. మరి Equality Of Votes వచ్చినప్పుడు ఒక నిర్ణయం ఎలా తీసుకుంటారు అంటే అక్కడ ఉండే ఒక వ్యక్తికి నిర్ణయించే అధికారం కట్టబెడతారు. దానినే నిర్ణయక ఓటు అంటారు. ఇంగ్లీషులో Casting Vote అని లేదా Deciding Vote అంటారు.


పార్లమెంట్ ప్రక్రియలో భాగంగా మనం equality of votes అని మనం చాలా సార్లు వింటూ ఉంటాము.  Equality Of Votes అంటే ఓట్లు సమానంగా రావడం. అంటే ఏమిటి అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లు పాస్ అవ్వాలా లేదా అనేది ఓటింగ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది దానిని సపోర్ట్ చేస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది. లేదా ఆ బిల్లు తిరస్కరణకు గురి అవుతుంది.


 కొన్ని సందర్భాలలో ఈ ఓట్లు అవును అన్నవారు అదేవిధంగా కాదు అన్నవారు ఇద్దరూ కూడా సమానంగా ఉన్నప్పుడు దాన్ని ఈ Equality Of Votes అంటాం. మరి Equality Of Votes వచ్చినప్పుడు ఒక నిర్ణయం ఎలా తీసుకుంటారు అంటే అక్కడ ఉండే ఒక వ్యక్తికి నిర్ణయించే అధికారం కట్టబెడతారు. దానినే నిర్ణయక ఓటు అంటారు. ఇంగ్లీషులో Casting Vote అని లేదా Deciding Vote అంటారు.


 అయితే లోక్సభలో ఈ అధికారం ఎవరికి ఉంది? నిర్ణయక ఓటు వేసే అధికారం ఎవరికి ఉంది అని గతంలో చాలా పరీక్షలలో అడగడం జరిగింది. సమాధానం ఏమిటి అంటే — స్పీకర్.


 చూడండి లోక్ సభ స్పీకర్ వచ్చేసి లోక్ సభలో సభ్యుడు. అంటే లోక్ సభలో ఉన్న సభ్యుడిని ఎన్నుకుని స్పీకర్గా అక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉంటుంది. అతను ప్రభుత్వానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడటం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ చేయకూడదు. అన్ని పార్టీల వారిని సమానంగా చూసే బాధ్యత స్పీకర్ ది!!


 కాబట్టి మామూలుగా బిల్లుపై చర్చ జరిగి ఓటు వేసేటప్పుడు అప్పుడు స్పీకర్ కు ఓటు వేసే అధికారం ఉండదు. స్పీకర్ ఏం చేస్తాడు అంటే మోనిటైజ్/ సూపర్ వైజ్ చేస్తాడు. ఓటింగ్ ప్రాసెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అని అతను చూడాలి. అటువంటి అప్పుడు స్పీకర్ కు ఓటు వేసే అధికారం లేదు ❌️


 కానీ ఎప్పుడైతే ఓట్లు వస్తాయో.. ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ అనేవి ఉంటాయో అప్పుడు స్పీకర్ ఓటు వేయడం జరుగుతుంది. ✅️

  •  అంటే స్పీకర్ ఓటు ప్రకారంగా ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా తిరస్కరించబడుతుందా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనిని నిర్ణాయక ఓటు అన్నారు. ఇది లోక్ సభలో జరిగే ప్రక్రియ.


మరి ఇటువంటి పరిస్థితి గనుక రాజ్యసభలో వస్తే ఎలా?

  • లోక్ సభలో స్పీకర్ ఉన్నట్టుగా రాజ్యసభలో చైర్మన్ కనిపిస్తాడు. కానీ లోక్ సభ స్పీకర్ లోక్సభలో సభ్యుడై ఉండాలి కచ్చితంగా. లోక్ సభ సభ్యుడు మాత్రమే లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక కాగలడు. ఇక వేరే ఎవరు కూడా కాలేరు.

  •  కానీ రాజ్యసభ విషయానికి రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు కాదు.


 అంటే దీని అర్థం ఏమిటి? రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత అతను రాజ్యసభ చైర్మన్ గా, ex officio chairman గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది.


 అప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ ఉపరాష్ట్రపతిగా గెలిచిన తర్వాత అప్పుడు ఆ రాజ్యసభ సీటు అనేది ఖాళీ అవుతుంది. కాబట్టి ఆ సభలో సభ్యుడు కాదు. మరి రాజ్యసభ సభ్యుడు కాదు, చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లోక్ సభలో స్పీకర్ చేసే పనులు అన్ని రాజ్యసభలో చైర్మన్ చేయవలసి ఉంటుంది.


 వారి లోక్ సభలో స్పీకర్ నిర్ణయక ఓటు వేస్తారు. ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన లోక్సభలో సభ్యుడు. కానీ రాజ్యసభకు వచ్చేటప్పటికి రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు కాదు. మరి నిర్ణయక ఓటు వేయవచ్చునా? అంటే రాజ్యాంగం నిర్ణయక ఓటు వేసే అధికారం రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ చైర్మన్ కు కట్టబెట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌


Q: లోక్ సభలో నిర్ణయాక ఓటు వేసేది ఎవరు?

  • స్పీకర్


Q: రాజ్య సభలో నిర్ణయాక ఓటు వేసేది ఎవరు?

  • చైర్మన్


మరి చైర్మన్ అనే వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కాదు కదా!! మరి నిర్ణయక ఓటు వేసే అధికారం ఎవరు ఇచ్చారు అంటే అది రాజ్యాంగం ఇచ్చింది. 





Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


Facebook: APPSC TSPSC GUIDELINES (Click here to follow)







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు