Header Ads Widget

Responsive Advertisement

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఎందుకు మార్చారు? (NOV-2022)

Why was the Rajiv Gandhi Khel Ratna Award Renamed as Major Dhyan Chand Khel Ratna Award?

Let us know about the most important and highest award in India related to sports. That is the Khel Ratna Award.


Q: What is the full name of the Khel Ratna Award?

  • Major Dhyan Chand Khel Ratna Award



👉 Rajiv Gandhi Khel Ratna Award = Major Dhyan Chand Khel Ratna Award

You have heard of the Rajiv Gandhi Khel Ratna Award many times in the past but is that award a different award? The names are the same. Khel Ratna is the same. What is the difference between the two? The two are not separate. Two are one.


What was earlier called the Rajiv Gandhi Khel Ratna Award has been renamed. In 2021, this name will be changed and since then it will be announced as the Major Dhyan Chand Khel Ratna Award. Very very important 📌


We can say that this is the highest award related to sports in India. In the year 1991, the former Prime Minister of India late Rajiv Gandhi was brutally assassinated on May 21. It was an unfortunate incident. Later it was announced that an award related to sports (Rajiv Gandhi Khel Ratna Award) should be announced in his memory.


👉 Who was the first recipient of Rajiv Gandhi Khel Ratna Award?

Q: Who was the first person to receive this award after it was announced in memory of Rajiv Gandhi in relation to sports? 📌

  • Chess legend Viswanadhan Anand


This question is very very important. Who was the first recipient of the Rajiv Gandhi Khel Ratna Award? Chess legend Viswanadhan Anand. Remember. After that given to many legendary people like 

  1. Sachin Tendulkar

  2. Mary Co

  3. Rani Rampal — This award has been given to many.


👉 Why has Rajiv Gandhi Khel Ratna Award been renamed as Major Dhyan Chand Khel Ratna Award in 2021?

But as the Prime Minister said in the year 2021, they received a lot of petitions! What is the essence of it? If a request is made to change the name of this award from Rajiv Gandhi Khel Ratna to Major Dhyan Chand Khel Ratna Award.. The Prime Minister announced in the year 2021 that we are changing this name in response to everyone's wish. Since then this award has been given as the Major Dhyan Chand Khel Ratna Award. Very very important 📌


Who is Major Dhyan Chand?

There is no need to say anything special about Major Dhyan Chand. Everyone is familiar!! Whenever we say hockey, the name that comes to mind is Major Dhyan Chand.

  • He is highly talented.

  • He scored 400 goals in his international career.

  • He also won gold medals in the Olympics three times while in the Indian team.


👉 What is Dhyan Chand Award (Lifetime Award)?

Also let's see What is another important thing? Apart from this Major Dhyan Chand Khel Ratna Award, Dhyan Chand Award which means Lifetime Achievement Award is named after him. This Lifetime Achievement is given to those who have performed well in their life and have consistently contributed to the sport and the country.


👉 Arjuna Award:

Also Arjuna Award is given to people who excel in sports, show leadership qualities and are disciplined.


👉 Dronacharya Award:

Also the best coaches in India - Dronacharya award is given to them.


👉 Who is the recipient of Major Dhyan Chand Khel Ratna Award for the year 2022?

Also the last important point and what is the question likely to be asked in the exam?

Q: Who is the recipient of Major Dhyan Chand Khel Ratna for the year 2022?

A native of Tamil Nadu. The man who waved the national flag of India – his name is table tennis player Sarath Kamal Achanta. Very very important. You should remember this name. He is going to get this award on November 30, 2022. It is going to be received by the hands of the President at Rashtrapati Bhavan.


ALSO READ IN TELUGU:

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఎందుకు మార్చారు? 

 

స్పోర్ట్స్ కు సంబంధించిన భారతదేశంలో అతి ముఖ్యమైన, అత్యున్నతమైన పురస్కారము దాని గురించి మనం తెలుసుకుందాము. అదే ఖేల్ రత్న అవార్డు.

Q: ఆ ఖేల్ రత్న అవార్డు యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే?

  • మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు


👉 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు = మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు

మీరు గతంలో చాలాసార్లు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కానీ మీరు విన్నారు అయితే ఆ అవార్డు ఈ అవార్డు వేరు వేరు అవార్డులా? పేర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. ఖేల్ రత్న మాత్రం ఒకటే ఉంది. మరి రెండు వేరువేరా అంటే?

  •  రెండు వేరువేరు కాదు. రెండు ఒక్కటే.


 గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచిన దాన్ని పేరు మార్చడం జరిగింది. 2021లో ఈ పేరు మార్చి అప్పటినుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా దీనిని ప్రకటించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌


 ఇది భారతదేశపు స్పోర్ట్స్ కు సంబంధించి అత్యున్నతమైన పురస్కారంగా మనం చెప్పవచ్చును. 1991 సంవత్సరములో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మే 21న దారుణంగా హత్య చేయబడ్డారు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ తర్వాత వారి యొక్క జ్ఞాపకార్ధంగా స్పోర్ట్స్ కు సంబంధించి ఒక అవార్డు ప్రకటించాలి అని (రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును) ప్రకటించడం జరిగింది.


👉 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

Q: రాజీవ్ గాంధీ జ్ఞాపకార్ధంగా స్పోర్ట్స్ కు సంబంధించి ప్రకటించిన తర్వాత ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? 📌

  • చెస్ లెజెండ్ విశ్వనాధన్ ఆనంద్ 


 ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? చెస్ లెజెండ్ విశ్వనాధన్ ఆనంద్. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత బోరడంత మంది మహామహునులకు

  • సచిన్ టెండుల్కర్

  • మేరీ కోం

  • రాణి రాంపాల్ — ఇలా చాలామందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.


👉 2021 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఎందుకు నామకరణం చేయడం జరిగింది?

 అయితే 2021వ సంవత్సరంలో ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రకారంగా వారికి బోలెడన్ని వినతి పత్రాలు వచ్చాయి అట! దాని యొక్క సారాంశం ఏమిటి అంటే? ఈ అవార్డు యొక్క పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని మార్చి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే.. అందరి కోరికను మన్నించి ఈ పేరు మారుస్తున్నాము అని ప్రధానమంత్రి గారు 2021 వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అప్పటినుంచి ఈ అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా దీనిని ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌


👉 మేజర్ ధ్యాన్ చంద్ ఎవరు?

ఇక మేజర్ ధ్యాన్ చంద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ సుపరిచితుడే!! మనం ఎప్పుడైతే హాకీ అంటామో.. హాకీ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు — మేజర్ ధ్యాన్ చంద్.

  1. వారు అత్యధికమైన ప్రతిభాశాలి.

  2. వారి యొక్క ఇంటర్నేషనల్ కెరీర్లో 400 గోల్స్ వారు చేయడం జరిగింది.

  3. వారు భారత టీమ్ లో ఉన్నప్పుడు మూడుసార్లు ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది.


👉 ధ్యాన్ చంద్ అవార్డు (జీవితకాల పురస్కారం) అంటే?

 అలాగే చూడండి మనకు.. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే? ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కాకుండా, ధ్యాన్ చంద్ అవార్డు అని జీవితకాల పురస్కారం అంటే Lifetime Achievement పురస్కారం ఆయన పేరు మీదే ఉంది. అది వారి జీవితం లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేసి, Consistent గా వారి వలన ఆ క్రీడకు, దేశానికి వన్నె తెచ్చారో వారికి ఈ Lifetime Achievement ఇవ్వడం జరుగుతుంది.


👉 అర్జున అవార్డు:

అలాగే అర్జున అవార్డు ఏమో క్రీడల్లో అద్భుతంగా రాణించి, నాయకత్వ లక్షణాలు చూపిస్తూ, క్రమశిక్షణతో ఉన్న వ్యక్తులకు ఈ అర్జున అవార్డు అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది.


👉 ద్రోణాచార్య అవార్డు:

 అలాగే భారతదేశంలో ఉన్న అద్భుతమైన కోచస్ – వారికి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరుగుతుంది.


👉 2022వ సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?

 అలాగే చివరిగా ముఖ్యమైన పాయింట్ మరియు ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏమిటి అంటే?

Q: 2022వ సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?

  • తమిళనాడుకు చెందిన వ్యక్తి. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన వ్యక్తి – ఆయన పేరే టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ అచంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేరుని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.

  • 2022, నవంబర్ 30వ తేదీన వీరు ఈ అవార్డును పొందబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పొందబోతున్నారు. 



Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు