Header Ads Widget

Responsive Advertisement

ASMT అంటే ఏమిటి? Anti-Satellite Missile Test

 

ఈ ప్రశ్న గ్రూపు వన్ పరీక్షలో అడగడం జరిగింది   Q: భారతదేశం యొక్క "యాంటీ సాటిలైట్ షిప్ అనే పరీక్షకు" సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:   పరీక్ష విజయవంతంగా లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రత్యక్ష ఉపగ్రహాన్ని నాశనం చేసింది ✅️   అంతరిక్ష వ్యర్ధాలు లేకుండా ఉండటానికి ఎగువ వాతావరణంలో పరీక్ష జరిగింది ❌️   ప్రపంచంలో ఈ రకమైన క్షిపణి వ్యవస్థ కలిగి ఉన్న నాలుగవ దేశం మన భారతదేశం ✅️    పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరి అయినది /సరైనది ఏమిటి?

ASMT అంటే ఏమిటి?

ఈ ప్రశ్న గ్రూపు వన్ పరీక్షలో అడగడం జరిగింది 

Q: భారతదేశం యొక్క "యాంటీ సాటిలైట్ షిప్ అనే పరీక్షకు" సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

  1.  పరీక్ష విజయవంతంగా లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రత్యక్ష ఉపగ్రహాన్ని నాశనం చేసింది ✅️

  2.  అంతరిక్ష వ్యర్ధాలు లేకుండా ఉండటానికి ఎగువ వాతావరణంలో పరీక్ష జరిగింది ❌️

  3.  ప్రపంచంలో ఈ రకమైన క్షిపణి వ్యవస్థ కలిగి ఉన్న నాలుగవ దేశం మన భారతదేశం ✅️


 పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరి అయినది /సరైనది ఏమిటి?


1️⃣ పరీక్ష విజయవంతంగా లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రత్యక్ష ఉపగ్రహాన్ని నాశనం చేసింది

  •  ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ✅️


2️⃣ అంతరిక్ష వ్యర్ధాలు లేకుండా ఉండటానికి ఎగువ వాతావరణంలో పరీక్ష జరిగింది

  •  ఈ స్టేట్మెంట్ తప్పు ❌️


 ఎందుకంటే మనము ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించిన తర్వాత ప్రపంచంలో ఇతర దేశాలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇండియా జరిపే ఇటువంటి పరీక్షల వలన ఈ అంతరిక్ష వ్యర్ధాలు అనేవి పెరుగుతాయి అని!!


 అయితే భారతదేశం ఏమని కౌంటర్ ఇచ్చింది అంటే ఆల్రెడీ బోలెడన్ని వ్యర్ధాలు ఉన్నాయి కానీ ఈ పరీక్ష వల్ల భారతదేశం ద్వారా వెలువడిన ఈ వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం ఉండవు. అవి కింద పడిపోతాయి అని భారతదేశం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ 2 అనేది తప్పు.


3️⃣ ప్రపంచంలో ఈ రకమైన క్షిపణి వ్యవస్థ కలిగి ఉన్న 4వ దేశం — భారతదేశం 

  •  ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ✅️


 అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏమిటి? భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించింది కాబట్టి అక్కడ నాలుగో దేశం అని అంటున్నారు. అయితే దీనికంటే ముందుగా మూడు దేశాలు ఉన్నాయి. అది నిజమేనా? భారతదేశ నాలుగో దేశమేనా? కాబట్టి ఈ స్టేట్మెంట్ మీద మనకు క్లారిటీ బాగా ఉండాలి.


 అయితే పరీక్షలో ఇక్కడ నాలుగవ దేశమని కాకుండా మూడవ దేశము, రెండవ దేశము, ఒకటవ దేశము అని ఏదైనా ఇవ్వవచ్చు. కాకపోతే పరీక్షలో మనకు మార్క్ రావాలి అంటే కచ్చితంగా భారతదేశం నాలుగవ దేశమేనా కాదా అన్న క్లారిటీ మనకు ఉండాలి.


 అయితే మనకు తెలిసిన విధంగా ఇటువంటి క్షపని వ్యవస్థ కలిగిన దేశాలలో

  1. మొదటి దేశం అమెరికా అయితే..

  2. రెండవ దేశం రష్యా అయితే..

  3. మూడవ దేశం చైనా!!

  4. ఈ మూడు దేశాల తర్వాత భారతదేశము ఇటువంటి వ్యవస్థ కలిగి ఉన్న నాలుగవ దేశంగా అవతరించింది.


Important Points:

☑️ ఈ పరీక్ష విజయం అమెరికా, రష్యా మరియు చైనాల తర్వాత శత్రు ఉపగ్రహాన్ని ధ్వంసం చేయగల నాల్గవ దేశంగా భారత దేశం అవతరించింది

Q: Anti-Satellite Missile Test అనేది విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే ఇటువంటి వ్యవస్థ కలిగిన దేశాలను వరుస క్రమంలో అమర్చండి. (ఆన్సర్ 👇)

  1. అమెరికా

  2. రష్యా

  3. చైనా

  4. భారతదేశం


☑️ ఉపగ్రహ వ్యతిరేక ఆయుధం లేదా ASAT అనేది ఉపగ్రహాన్ని నాశనం చేసే లేదా భౌతికంగా దెబ్బతీసే ఆయుధం.

  •  అలాగే ఈ ఉపగ్రహ వ్యతిరేక ఆయుధం అంటే ఏమిటి? దీనినే Anti-Satellite Missile Test అంటారు. ఇది ఏమిటి అంటే ఉపగ్రహాన్ని నాశనం చేస్తుంది. లేదా భౌతికంగా దెబ్బతీస్తుంది. 


☑️ భారతదేశం యొక్క ASAT సామర్ధ్యం యొక్క విజయవంతమైన ప్రదర్శన ICBMని అడ్డగించే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

  •  అయితే మన దేశానికి ఈ సామర్థ్యం రావడం వలన ICBM ని అడ్డగించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ICBM అంటే ఏమిటి? — Intercontinental ballistic Missile. కాబట్టి వాటిని అడ్డుకునే సామర్థ్యం భారతదేశానికి వచ్చింది. 


☑️ 'మిషన్ శక్తి' భారత ఉపగ్రహాన్ని తక్కువ భూమి కక్ష్యలో ఢీకొట్టింది, వస్తువును శిధిలాలుగా మార్చింది.

  •  దీని యొక్క కోడ్ ఏమిటి అంటే – మిషన్ శక్తి. అంటే మిషన్ శక్తి అన్నా అదే విధంగా Anti-Satellite Missile Test ఒక్కటే!!


 అంటే ఇది ఏమి చేసింది అంటే భారత ఉపగ్రహాన్ని/ మన ఉపగ్రహానికి missile test ద్వారా ఢీ కొట్టి గారడి ధ్వంసం చేయడం జరిగింది. భారత ఉపగ్రహాన్ని తక్కువ భూమి కక్షలో అంటే లోయర్త్ కక్షలో ఢీ కొట్టి వస్తువును శిలాలుగా మార్చడం జరిగింది.


అందుకనే ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టాయి. దీనివలన అంతరిక్షంలో వ్యర్ధాలు పెరుగుతున్నాయి అని అంతరిక్ష ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే అన్ని దేశాలకు భారతదేశం సర్ది చెప్పడం జరిగింది.






Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


Facebook: APPSC TSPSC GUIDELINES (Click here to follow)





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు