Q: జీఎస్టీ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:  జీ.ఎస్.టీ. ప్రత్యక్ష పన్ను చట్టాలకు మరింత పారదర్శకతను తెస్తుంది  జీ.ఎస్.టీ. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు.  జీ.ఎస్.టీ. అనేది గమ్యం ఆధారిత పన్ను.   పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?


Q: జీఎస్టీ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

  1. జీ.ఎస్.టీ. ప్రత్యక్ష పన్ను చట్టాలకు మరింత పారదర్శకతను తెస్తుంది

  2. జీ.ఎస్.టీ. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు.

  3. జీ.ఎస్.టీ. అనేది గమ్యం ఆధారిత పన్ను.


పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?


1️⃣ జీ.ఎస్.టీ. ప్రత్యక్ష పన్ను చట్టాలకు మరింత పారదర్శకతను తెస్తుంది

  •  ఈ స్టేట్మెంట్ తప్పు ❌️


జీఎస్టీ అంటేనే పారదర్శకత. అయితే ఈ స్టేట్మెంట్ సరిగ్గా చదివితే ఇది ప్రత్యక్ష పన్ను చట్టాలకు అని చెప్పడం జరిగింది. అయితే జిఎస్టి అనేది ప్రత్యక్ష పన్ను కాదు. అది పరోక్ష పన్ను. కాబట్టి ఈ మొదటి స్టేట్మెంట్ అనేది తప్పు.


2️⃣ జీ.ఎస్.టీ. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు.

  • ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ✅️


ఆల్రెడీ మనకు రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి మనకు తెలుసు, ఆర్టికల్ 368 ఏం చెబుతుందో మనకు తెలుసు. అలాగే ఒక చట్టాన్ని /రాజ్యాంగాన్ని సవరించాలి అంటే దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దాంట్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత రాష్ట్రపతి అనుమతితో ఆ బిల్లు కాస్త చట్టంగా మారుతుంది అని మనకు తెలుసు.


అయితే మరి ఇక్కడ 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటున్నాము. మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని మనకు ఒక సందేహం వస్తుంది. అయితే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో బిల్లు అన్నారు తప్ప చట్టం గురించి మాట్లాడలేదు ఇక్కడ.


అంటే బిజీఎస్టీ కి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టి, దానిని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం తర్వాత అది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది.


 అంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది? ఇక్కడ ఈ చట్టానికి సంబంధించిన నెంబర్ యే కాకుండా ప్రవేశపెట్టబడిన బిల్లు నెంబర్ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టిన తర్వాత అది ఆమోదం పొంది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది.  ఎంతో క్షుణ్ణంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది.


కాబట్టి ప్రశ్న చదివేటప్పుడు అక్కడ బిల్లు గురించి అడిగారా లేదా చట్టం గురించి అడిగారనేది చూడాలి.

  • ఒకవేళ బిల్లు అయితే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అవుతుంది 📌

  •  ఒకవేళ చట్టం అయితే 101 వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది 📌


3️⃣ జీ.ఎస్.టీ. అనేది గమ్యం ఆధారిత పన్ను.

  •  ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ✅️


ఎలా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చూస్తే.. జీ.ఎస్.టీ. అనేది గమ్యం ఆధారిత పన్ను అని మన అందరికీ ఆల్రెడీ తెలుసు.