2011వ సంవత్సరం నుంచి భారత దేశంలో ప్రతి జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం 2 పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోవాలి.  Q: జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఏ తేదీన జరుపుకుంటాము?  జనవరి 25   Q: అలాగే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించ్చాము?  2011   Q: ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించిన సంవత్సరంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరు?   డాక్టర్ మన్మోహన్ సింగ్


 2011వ సంవత్సరం నుంచి భారత దేశంలో ప్రతి జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం 2 పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోవాలి.

Q: జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఏ తేదీన జరుపుకుంటాము?

  • జనవరి 25


Q: అలాగే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించ్చాము?

  • 2011


Q: ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించిన సంవత్సరంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరు?

  •  డాక్టర్ మన్మోహన్ సింగ్


 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి? దాని వలన లాభం ఏమిటి? మనం ఎప్పుడైనా ఏదైనా తేదీని ఒక ప్రత్యేక దినోత్సవంగా జరుపుతున్నాము అంటే ప్రజలలో అవగాహన కల్పించడానికి. అవగాహన పెంపొందించే దశగా చేసే ప్రయత్నం.


 చూడండి మన భారతదేశంలో 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి భారతీయుడు కూడా ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హుడు. కానీ మనం ప్రారంభిక రాజ్యాంగాన్ని కనుక చూస్తే 21 సంవత్సరాలు వయసు వచ్చిన వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. అంటే మధ్యలో ఏమయింది? రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది.

  • ఎప్పుడు? — 1989

  • ఆ రాజ్యాంగ సవరణ ఎన్నవది? — 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఓటు వేసే వయస్సును అది 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం అంటూ జరిగింది.


👉 అంటే 1989లో 61వ రాజ్యాంగ సవరణ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి అర్హులు.


 మరి 18 సంవత్సరాల వయసులో ఈ రాజకీయాలకు సంబంధించిన అవగాహన ఉంటుందా? మరి ఆ వయసులో ఉన్న పిల్లలు ముందుకు వచ్చి ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తారా? ఆ విధంగా చర్చ అనేది కొంతకాలం కొనసాగింది.


 2011వ సంవత్సరంలో ఎన్నికల సంఘం చొరవతో ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం వలన జనవరి 25వ తేదీని నేషనల్ ఓటర్స్ డే గా ప్రకటించడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ తేదీన అంటే జనవరి 25వ తేదీన ప్రజలు అందరికీ, ఓటర్లు అందరికీ ఒక అవగాహన అనేది కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.


2023 జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ ఏమిటి?

 అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి ఒక థీమ్ అంటూ ఉంటుంది. పరీక్షలలో మనల్ని అడుగుతారు.

Q: 2023వ సంవత్సరానికి సంబంధించి జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఏది?

  • Nothing Like Voting, I Will Vote For Sure


 కాబట్టి ఇక్కడ ఏ తేదీన జరుపుకుంటారు? ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అలాగే 2023 వ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏమిటి? అనే ఈ మూడు ప్రశ్నలు కూడా ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. కాబట్టి Nothing like voting, I will vote for sure అనేది 2023 సంవత్సరానికి సంబంధించిన థీమ్.


13th NVD:

☑️ January 25, 2023

 జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకుంటాము.


☑️ January 25th the national focus on creating awareness about the need to take part in the electoral process.

 అలాగే ప్రతి సంవత్సరం ఈ జనవరి 25న భారతదేశం మొత్తం కూడా ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే – ఓటు గురించిన అవగాహన ప్రతి ఒక్కరులో పెంపొందించాలి.


 అసలు ఓటు అనేది ఎందుకు? అనే విషయాల గురించి అవగాహన పెంపొందిస్తారు. మనం చెప్పుకుంటూ ఉంటాము భారతదేశం అనేది ప్రపంచంలోకెల్లా ప్రజాస్వామ్యం గల దేశం. కాబట్టి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా కచ్చితంగా బయటికి వెళ్లి ఆ ఓటింగ్ రోజున ఓటు వేస్తేనే ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యము అనే పదానికి నిజమైన మీనింగ్ అనేది వస్తుంది.


☑️ the observance of the day began has an initiative by the ECI in 2011.

దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జరుగుతూ ఉన్నాయి.