Header Ads Widget

Responsive Advertisement

పార్లమెంట్ అధికారభాషా కమిటీ అధ్యక్షుడు ఎవరు? (అక్టోబర్ 12, 2022)

పార్లమెంట్ అధికారభాషా కమిటీ అధ్యక్షుడు ఎవరు? (అక్టోబర్ 12, 2022 - Current Affair)


భారత రాజ్యాంగ ప్రకారంగా భారతదేశానికి సంబంధించిన Official Language (అధికార భాష) హిందీ. Hindi in Devanagari Script. ఇది రాజ్యాంగంలో చెప్పబడి ఉంది.


అయితే ఈ అధికార భాషను ఎలా ప్రమోట్ చేయాలి? దాని గురించి ఒక పార్లమెంటరీ స్థాయి సంఘం అని ఒకటి ఉంది. దాన్నే పార్లమెంటరీ కమిటీ అంటాము. పార్లమెంటులో బోలెడన్ని కమిటీలు ఉంటాయి. అన్ని కమిటీలు కూడా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. అయితే ఏ కమిటీ ఎప్పుడైతే వార్తలలో ఉంటుందో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ప్రస్తుతం Parliamentary Committee On Official Language అనే ఈ కమిటీ చాలా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఇప్పటికే 3 రిపోర్టులు ఇక్కడ రాష్ట్రపతికి సమర్పించడం అంటూ జరిగింది. అయితే ఆ కమిటీ ఇటీవల ఇచ్చిన రిపోర్టులో ఏమి ఉంది అంటే?

  • IIT లో కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని తగ్గించి హిందీ మాధ్యమంలో బోధిస్తూ, అలాగే రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అయితే ఏ ప్రాంతీయ భాష ఉంటుందో.. ఆ భాషలో బోధనలు చేయాలి అన్నట్టుగా ఒక రికమండేషన్ ఇవ్వడం అంటూ జరిగింది. తద్వారా హిందీని ప్రమోట్ చేస్తూ, ప్రాంతీయ భాషలను కూడా ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కమిటీ ముందుకు వెళుతుంది. 📌

అయితే మనకు కావాల్సిందేమిటి అంటే ఈ కమిటీకి అనగా ఈ అధికార భాషా సంఘానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే? జ్ఞాపకం పెట్టుకోండి.

  • ప్రస్తుతం ఉన్న హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా. దయచేసి ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ పరీక్షలలో అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు అని అడిగి అక్కడ కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి.


 అలాగే మనకు ప్రతి మంత్రిత్వ శాఖలో మనకు డిపార్ట్మెంట్లు ఉంటాయి అని మనం పైన చెప్పుకున్నాం. అయితే ఈ హోం శాఖ మంత్రిత్వ శాఖలో ఉండే డిపార్ట్మెంటుల్లో ఒక డిపార్ట్మెంట్ ఏమిటి అంటే? ఈ అఫీషియల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్. అది కూడా ఒక డిపార్ట్మెంట్. అంటే భారత ప్రభుత్వం అధికార భాషను ప్రమోట్ చేయడానికి అంత ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో హిందీని ఎక్కువగా ప్రమోట్ చేసినప్పుడు.. కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకుంటూ,. జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది.


 అలాగే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రానికి చెందిన లేదా కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలు ఏవైతే ఉంటాయో.. వాటి విలువ ఎప్పుడు కూడా తగ్గించకుండా, వాటి విలువను పెంచుతూ.. అలాగే హిందీ భాషను కూడా ముందుకు తీసుకువెళ్లాలి అని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇది సఫలం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అధికార భాషా సంఘానికి సంబంధించిన అంశాలు. ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ తో తర్వాత రాబోయే బ్లాగ్ కంటెంట్ తో కలుద్దాము. All the very best.


Q: ఈ Parliament అధికార భాషా సంఘానికి అధ్యక్షత వహించేది ఎవరు? 📌

  • ప్రస్తుతం ఉన్న హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా



follow us on:
Instagram: appsc_tspsc_guidelines

Youtube: APPSC TSPSC GUIDELINES


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు