Header Ads Widget

Responsive Advertisement

మంగళయాన్ ఏ వాహన నౌక ద్వారా ప్రయోగించబడింది? ఇది మార్స్ కక్ష్యలోకి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? (అక్టోబర్ 2022 -కరెంట్ అఫ్ఫైర్ )

 మంగళయాన్ ఏ వాహన నౌక ద్వారా ప్రయోగించబడింది? ఇది మార్స్ కక్ష్యలోకి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?

ఇప్పుడు MOM అంటే ఏమిటో తెలుసుకుందాం. MOM stands for Mars Orbiter mission. దీనినే చాలా ప్రముఖంగా మంగళయాన్ అని పిలుస్తారు. మంగళయాన్ గురించి ఈ 2022, అక్టోబర్ నెలలో మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే — 2013లో ఇస్రో ద్వారా ప్రయోగించబడిన ఈ మంగళయాన్ వాస్తవానికి 6 నెలలు మాత్రమే పని చేస్తుంది అనుకుంటే.. అద్భుతంగా 8 సంవత్సరాల పాటు పని చేసింది.


 ఇక ఈ మంగళయాన్ లో ఉన్న ఇంధనం అయిపోవడం వలన ఈ మంగళయాన్ నుంచి వచ్చే సమాచారం అనేది ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రోనే వెల్లడించడం జరిగింది. అందుకనే మంగళయాన్ అనేది ప్రస్తుతం వార్తలలో ఉంది. కాబట్టి 2013 -14 సంవత్సరంలో జరిగిన అంశాలను ఒకసారి మనం ఒకసారి మననం చేసుకుంటే ఇది మనల్ని ఎగ్జామినేషన్లో ఏదైనా అడిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఎగ్జామ్లో మనం చూస్తాము ఇస్రోకు సంబంధించిన ఏదో ప్రశ్న అనేది కచ్చితంగా వస్తుంది. ఇక ప్రస్తుతం మంగళయాన్ అనేది వార్తలలో మనకు ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని అంశాలను మనం తెలుసుకుందాము.


MOM (Mars Orbiter mission)

  1. కాబట్టి దీంట్లో ఉన్న ఈ ఫ్యూయల్ అయిపోవడం వలన బ్యాటరీ కాస్త డ్రైన్ అవుట్ అయిపోయింది.

  2.  అలాగే ఇది వాస్తవానికి 6 నెలల కోసం డిజైన్ చేస్తే.. ఇది 8 సంవత్సరాల పాటు తన సేవలను అందించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం భావించవచ్చును.

  3.  అలాగే ఈ మార్స్ యొక్క రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఎవరు? అంటే — సుబ్బయ్య అరుణన్. వీరు అద్భుతమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. కాబట్టి ఆ పేరు అనేది మనకు ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. 📌

  4. ఇది 450 కోట్ల బడ్జెట్ తో తయారు చేయబడింది. వాస్తవానికి మిగతా దేశాలతో గనుక పోల్చి చూస్తే ఈ బడ్జెట్ అనేది చాలా చాలా తక్కువ అని మనం చెప్పవచ్చును. అయితే ఈ చిన్న బడ్జెట్ తో తయారు చేసిన కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించడం అంటూ జరిగింది.


Q: అయితే MOM (Mars Orbiter mission)/ మంగళయాన్ న్ను ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రవేశపెట్టారు అంటే?

  • PSLV -C25


Q: అలాగే MOM (Mars Orbiter mission) / మంగళయాన్ న్ను ఏ తేదీన ప్రవేశపెట్టారు అంటే?

  •  నవంబర్ 5, 2013


Q: అలాగే MOM (Mars Orbiter mission)/ మంగళయాన్ న్ను విజయవంతంగా మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టిన తేదీ ఏది అంటే?

  • సెప్టెంబర్ 24, 2014


 ప్రశ్న అనేది ఎలాగైనా అడగవచ్చు. PSLV-C25 ద్వారా ప్రయోగించబడిన తేదీ ఏమిటి? అలాగే ఈ మంగళయాన్ మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టబడిన తేదీ ఏది? కాబట్టి ప్రశ్న అనేది జాగ్రత్తగా చదివితే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.


 అలాగే ఇస్రోకు సంబంధించి మరికొన్ని విషయాలు సాధారణంగా అడిగేవి ఏమిటి అంటే?

Q: ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు?

  • విక్రమ్ సారాభాయ్


Q: అలాగే ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు?

  • శ్రీ S. సోమనాథ్


Download Free PDF Here:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు