Header Ads Widget

Responsive Advertisement

APPSC Group-2 Notification: ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యిందా?

 APPSC Group-2 Notification: ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యిందా?

Click this picture to see the updates in APPSC website 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APPSC గ్రూపు -1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏపీపీఎస్సీ త్వరలోనే గ్రూపు 2 నోటిఫికేషన్ (APPSC Group-2 Notification) విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.

 ఏపీపీఎస్సీ అనుకున్నట్లుగా డేటా సేకరణ మొత్తం పూర్తయితే దాదాపు ఈ నెలలోనే అనగా అక్టోబర్లోనే, ఈ పది రోజుల్లో గ్రూప్ 2నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే సిలబస్ లో మాత్రం ఎటువంటి మార్పులు, చేర్పులు లేనట్లుగానే మనకు కనిపిస్తుంది. గతంలో ఏదైతే సిలబస్ కొనసాగించారో అదే సిలబస్ కొనసాగించాలన్న నిర్ణయానికి ఏపీపీఎస్సీ వచ్చినట్లు సమాచారం.


కానీ Scheme Of Valuation విధానంలో మాత్రం మార్పులు చేస్తుంది అనే సమాచారం మనకు వినిపిస్తుంది. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.


ఆల్రెడీ గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ (APPSC) పూర్తి చేసింది. రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులు గ్రూప్-1 పరీక్షకు సన్నద్ధం అవుతున్న ఈ సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి అని అభ్యర్థులు  కోరుతున్నారు. అదే గనుక జరిగితే రెండు ఎగ్జామినేషన్లకు తమ ప్రిపరేషన్ తోడవుతుందని చెబుతున్నారు.


అలాగే రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ విడుదల;

అదేవిధంగా రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు కూడా APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుప్రక్రియ నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది.


గ్రూప్ -1 సమాచారం:

 గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ(APPSC) ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రూపు 1 పోస్ట్ లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు.


ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం సమాచారం కొరకు psc.ap.gov.in ను సందర్శించవచ్చు.

  • గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో తెలపడం జరిగింది.

  • గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


గ్రూప్ -1 పోస్టుల వివరాలు:

  1. డిప్యూటీ కలెక్టర్ - 10

  2. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12

  3. డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13

  4. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02

  5. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02

  6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08

  7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02

  8. MPDO - 07

  9. జిల్లా రిజిస్ట్రార్స్ - 03

  10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01

  11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 0

  12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06

  13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు