Header Ads Widget

Responsive Advertisement

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతి తక్కువ కాలం పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు?

Who has the Shortest tenure as the Chief Justice of the Supreme Court?

click here to know supreme court

 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇటువంటి జస్టిస్ UU. లలిత్ గారిని భారత రాష్ట్రపతి నియమించడం జరిగింది. ఈ కోణంలో చూస్తే UU. లలిత్ గారు భారత సుప్రీంకోర్టుకు సంబంధించి 49వ ప్రధాన న్యాయమూర్తిగా వారిని నియమించడం అనేది జరిగింది. అయితే అతి త్వరలో భారతదేశం 50వ ప్రధాన న్యాయమూర్తిని కూడా చూడబోతోంది.


ఈ Context లో మనకు కావలసింది ఏమిటి అంటే? అసలు సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి గాని, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఈ పదవి కాలం ఎంత? పదవి కాలం ఎంత అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పదవి విరమణ జరిగితే వారికి ఐదు సంవత్సరాల పదవి కాలం అని చెప్పవచ్చు. ఇది ఐదు సంవత్సరాల, ఆరు సంవత్సరాల, ఏడు సంవత్సరాల అనేది రాజ్యాంగంలో చెప్పబడలేదు.


 మరి పదవి విరమణ ఎలా జరుగుతుంది అంటే? రాజ్యాంగపరంగా వారికి 65 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా వారు ఆ పదవిలో కొనసాగుతారు. అది న్యాయమూర్తి కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు.


Example:

  •  ఉదాహరణకు చూడండి ఒక వ్యక్తిని జడ్జిగా వారిని 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గాని నియమించడం జరిగితే… వారికి అప్పటి నుంచి 65 సంవత్సరాలు వయసు వచ్చేవరకు కొనసాగుతారు.

  • లేదా ఒక వ్యక్తిని 63 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జడ్జిగా నియమిస్తే వారికి 65 సంవత్సరాలు వయసు వచ్చేవరకు కొనసాగుతారు.


 అంటే అంతకుముందు నియమించబడిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ఉంటే, తర్వాత వచ్చిన వ్యక్తి మనకు ఇక్కడ రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు అలాకాకుండా కొన్ని సందర్భాలలో కొన్ని రోజులు మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టిన సందర్భాలు మనకు కనిపిస్తాయి.


 కాబట్టి ఈ సందర్భంలో మనకు ఆల్రెడీ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిని మనం చూస్తూ ఉన్నాం. అతి త్వరలో భారతదేశానికి సంబంధించి 50వ ప్రధాన న్యాయమూర్తి కూడా వారు రాబోతున్నారు.


 ఈ ప్రక్రియలో మనకు కావలసింది ఏమిటి అంటే? భారత ప్రధాన న్యాయమూర్తిగా అతి తక్కువ కాలం పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? కానీ మనల్ని పరీక్షలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన సమాధానం ఏమిటంటే ఇప్పుడు చూద్దాం.


Q: కింది వారిలో ఎవరు చాలా తక్కువ కాలం (17/18)+రోజులు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు?


Q: Who of the following serves as the Chief Justice of India for a very short term (17/18)+days?

  1. Justice H J Kania ❌️

  2. Justice Ranganath Mishra ❌️

  3. Justice Kamal Narain Singh ✅️

  4.  None of the above

 ఇక్కడ మనకు సమాధానం వచ్చేసి జస్టిస్ కమల్ నరైన్ సింగ్. జ్ఞాపకం పెట్టుకోండి వారు కేవలం 18 రోజులు మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. ఇది జరిగినది ఎప్పుడు అంటే? 1991వ సంవత్సరంలో అని మనం కచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొనవలెను. ఎందుకు అంటే వారు ఆ 18 రోజులు కాగానే వారికి 65 సంవత్సరాల వయసు వచ్చేసింది. కాబట్టి వారు పదవీ విరమణ చేయడం అనేది జరిగింది.


 అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటి అంటే?

Q: సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?


Justice Kamal Narain Singh:

  • జస్టిస్ కమల్ నరైన్ సింగ్ – వీరు 22వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది  

  •  ఈయన కేవలం 17/18 రోజులు మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగడం జరిగింది 

  • అలాగే వారు నవంబర్ 25, 1991 నుండి డిసెంబర్ 12, 1991 వరకు వారు ప్రధాన న్యాయమూర్తిగా ఆ పదవిలో కొనసాగడం జరిగింది. ఆ తర్వాత వారు పదవి విరమణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు