Header Ads Widget

Responsive Advertisement

డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అంటే ఏమిటి? (OCT -2022)

What Are The Digital Banking Units?

డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ (DBUs) అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఇది బ్యాంకింగ్ సిస్టమ్ కు సంబంధించినది. మనకు ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టం ఎలాగ ఉంటుందో తెలుసు. అక్కడ ఈ బ్యాంకింగ్ సేవలు పొందాలి అనుకున్న వారు ఆ బ్యాంకుకు వెళ్లి ఆ సేవలు పొందడం అనేది జరుగుతుంది. డబ్బును విత్డ్రా చేసుకోవడం గానీ, డబ్బును డిపాజిట్ చేయడం గానీ.. అవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. అయితే ఈ DBUs ద్వారా అడ్వాంటేజ్ ఏమిటి అంటే? ఇవి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ (DBUs).


 ALSO READDigital Banking Units: What are they and how will they function

ADVANTAGES OF DBUs:


చాలామందికి ఏమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ availability ఉన్నవారికి, వారి ఇంట్లో కూర్చుని లేదా నెట్ సెంటర్లో కూర్చుని.. చక్కగా బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ కూడా వారు చేసుకుంటారు. కానీ ఆ అవకాశం లేని వారి కోసం ఎలా? అటువంటప్పుడు వారు బ్యాంకు తెరిచే వరకు వేచి చూడాలా? అటువంటి వారి యొక్క అసౌకర్యాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే 2022 -23 కేంద్ర బడ్జెట్లో హార్దిక శాఖ మంత్రి గారు చెప్పినది ఏమిటి అంటే? — "అతి త్వరలో భారతదేశంలో DBUs ఏర్పాటు చేయడం జరుగుతుంది అని!! అలా 75 DBUs ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాన్ని ఆర్బిఐ గవర్నర్ – శ్రీ శక్తికాంత దాస్ ప్రకటించడం జరిగింది". 📌📌📌

  •  ఈ DBUs ద్వారా digital Intracity పెంచడానికి ఉపయోగపడుతుంది.

  • అలాగే ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేది 24/7 పని చేస్తూ ఉంటాయి.


మరి ఒక వ్యక్తి ఆ DBUs దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి ఏమీ తెలియదు కదా అంటే? అక్కడ బ్యాంకింగ్ స్టాఫ్ ఉంటుంది. ఆ స్టాఫ్ ఆ వ్యక్తికి సహాయపడుతుంది. అలాగే అక్కడ డబ్బులు డిపాజిట్ చేయడం అదేవిధంగా విత్ డ్రా చేసుకోవడం అనేది అన్నీ కూడా చాలా సులువుగా జరుగుతాయి.


ఎక్కడైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదో.. ఎవరికైతే ఈ బ్యాంకింగ్ నెట్ సర్వీసెస్ తెలియదో వారందరికీ కూడా ఈ  DBUs అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏర్పాటు చేసినవి ఎన్ని అంటే 75. ఇక రాబోయే రోజుల్లో వీటిని విస్తృతంగా సంఖ్యను పెంచాలి అని RBI యోచిస్తుంది.


Q: భారతదేశంలో ఏర్పాటు చేసిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (DBUs) ఎన్ని?


జ్ఞాపకం పెట్టుకోండి. మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష యొక్క ప్రశ్నలు అనేవి చాలా కష్టతరంగా అడగడం మనం చూసాము. కాబట్టి మన ప్రిపరేషన్ స్థాయి కూడా ఆ విధంగా ఉండాలి. ఆ స్థాయిలో ఉండాలి అంటే మనం అక్కడ నేర్చుకునే ప్రతి అంశం కూడా చాలా క్షుణ్ణంగా నేర్చుకోవలసిన అవసరం ఉంది.


  ALSO READ | Can Digital Banking Units Take Banking Within the Reach Of Common Man?


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు