Header Ads Widget

Responsive Advertisement

GSLV మార్క్ 3 ను LVM -3గా ఎందుకు మార్చారు?

 Why Was GSLV Mark 3 Changed To LVM-3?


 ఇప్పుడు మనము ప్రస్తుతము వార్తల్లో ఉన్న GSLV Mark 3 గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ రాబోయే పరీక్షలలో మీకు GSLV Mark 3 అని కాకుండా అక్కడ వేరే పేరు ఏమైనా కనిపించే ఆస్కారం ఉంది. లేదా GSLV Mark 3 అనే పేరును ఈ విధంగా మార్చడం జరిగింది అని ఒక ప్రశ్న రావచ్చు.

  • అంటే GSLV Mark 3 అనే పేరును కాస్త మార్చి.. దాన్ని Launch vehicle mark 3 అనగా LVM 3 గా మార్చడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. 📌


అయితే ఈ GSLV Mark 3 ను ఉపయోగించి లేదా LVM 3 ను ఉపయోగించి అక్టోబర్ 23, 2022 న ఒకేసారి ఇస్రో ద్వారా 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇస్రో యొక్క విజయవంతమైన విజయం.


 అయితే మనకు ఈ లాంచెస్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే? శ్రీహరికోట లో ఉన్న SHAR నుంచి జరుగుతాయి. Satish Dhawan Space Centre నుంచి మనకు జరుగుతాయి. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు.


 అలాగే మీ అందరికీ తెలిసిన ఒక విషయమే కానీ అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నాము.

Q: మనకు ఈ SHAR సెంటర్ ఎక్కడ ఉంది?

  •  శ్రీహరికోట 


 ఆ శ్రీహరికోట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?

 ఇన్ని రోజులు ఆ శ్రీహరికోట అనేది నెల్లూరులో ఉంటే.. ప్రస్తుతం అది తిరుపతి జిల్లాలో ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల సంఖ్య అనేది పెంచడం జరిగింది. అంటే ఉన్న జిల్లాలను విభజించడం వల్ల ఎక్కువ జిల్లాలు వచ్చాయి. తద్వారా శ్రీహరికోట అనేది ప్రస్తుతం తిరుపతి జిల్లాలో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌📌📌


 పొరపాటున ఈ ప్రశ్న గనుక మనల్ని ఎగ్జామ్ లో అడిగి.. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది అన్నప్పుడు అక్కడ ఆప్షన్స్ లో నెల్లూరు అని ఇస్తాడు ముందు. ఒకవేళ అదే ఆన్సర్ అనుకుని పెడితే అది తప్పు అవుతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సరైన సమాధానం వచ్చేసి – తిరుపతి.


 ఇటువంటి పాయింట్స్ అనేవి ఆలిండియాలో జరిగే ప్రతి కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఏ కాంపిటేటివ్ పరీక్షకు అయిన చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.


👉 కాబట్టి ఇస్రో GSLV మార్క్ 3 పేరును లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM 3)గా మార్చింది.


Q: అలాగే ఈ LVM3 ద్వారా October 23వ తేదీన 2022వ సంవత్సరంలో ISRO ఎన్ని ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది.

  • 36 ఉపగ్రహాలు 


Q: అత్యంత బరువైన సాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది?

  • LVM 3


Q: GSLV Mark 3 యొక్క నూతన నామం ఏమిటి?

  • LVM 3


Key Points:

  • ISRO has renamed the GSLV Mark 3 as Launch vehicle Mark 3 (LVM 3)

  • Also this LVM 3 successfully launched 36 satellites simultaneously on October 23rd in the year 2022.

  • Also what is the heaviest satellite launch vehicle? — LVM 3

  • What is the new name of GSLV Mark 3? — LVM 3




Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు