Header Ads Widget

Responsive Advertisement

103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది? సుప్రీం కోర్టు దీనిని ఎందుకు సమర్థించింది?

 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది? సుప్రీం కోర్టు  దీనిని ఎందుకు సమర్థించింది?


 1992లో సుప్రీంకోర్టు ద్వారా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తీర్పు రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పు. ఆ తీర్పు ఉద్యోగాలలో రిజర్వేషన్, అలాగే విద్యా సంస్థలలో రిజర్వేషన్లకు సంబంధించినది. ఆ కేసును ఏమంటారు అంటే?


 ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే? Vacancies (ఖాళీలు) ఎన్నైతే ఉన్నాయో మొత్తంలో రిజర్వేషన్ అనేది 50 శాతానికి మించకూడదు అని చెప్పడం జరిగింది. ఇది 1992 కి సంబంధించినది. ఇక అప్పటినుంచి కూడా కొనసాగుతూ వస్తుంది.


ఇక 2019వ సంవత్సరంలో భారత పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చేసి.. ఆ రాజ్యాంగ సవరణను రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదించిన తర్వాత దానికి ఒక చట్ట రూపకతను ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు అది సమాఖ్యకు అంశాలు అయినపుడు పార్లమెంట్ ఉభయ సభలలో దాన్ని ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత, ఉన్న రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్రాలు అనగా సగం రాష్ట్రాలకు తక్కువ కాకుండా దానిని సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే.. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం తర్వాత అప్పుడు ఆ రాజ్యాంగ సవరణ బిల్లు కాస్త రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది. అదే రాజ్యాంగ సవరణ 103. కాబట్టి దానిని మనం 103వ రాజ్యాంగ సవరణగా చెబుతాము.


 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది?


 దాని ప్రకారం ఏమిటి అంటే EWS (economically weaker sections) అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది.

  • ఇక్కడ ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది,

  • ఎస్టీలకు ఉంది,

  • అలాగే ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఉంది.


ఎవరికి అయితే ఆల్రెడీ రిజర్వేషన్ ఉందో వారికి కాకుండా అంటే జనరల్ కేటగిరీలో /ఓపెన్ క్యాటగిరి లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఒక 10% రిజర్వేషన్ కల్పించాలి అని అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది.


 తద్వారా 1992వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏదైతే 50 శాతానికి మించకూడదు అన్న సీలింగ్ ఏదైతే ఉందో దానిని బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టులో ఈ రాజ్యాంగ సవరణ సవాలు చేసినప్పుడు.. దీనిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మసనానికి నివేదించడం జరిగింది.


ఈ రాజ్యాంగ ధర్మాసనములో మినిమమ్ 5 గురు జడ్జిలు ఉంటారు. దీంట్లో ఐదుగురు జడ్జిలలో నవంబర్ 7, 2022 న దీనికి సంబంధించిన తీర్పు ఇవ్వడం జరిగింది. దానిని 3:2 — అంటే ముగ్గురు జడ్జీలు 103వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగబద్ధమే అని గుర్తిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.


 తద్వారా ఈ రిజర్వేషన్ కు సంబంధించిన అడ్డంకులు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయి.. ఇక ఈ 10% రిజర్వేషన్, EWS వారికి అది అమలు చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇది అమలులో ఉంది. ఇక ముందు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తుంది అన్నట్టుగా మనం భావించాలి. 



👉 Also Read in English: 

What is the 103rd Constitutional Amendment Act about? Why did the Supreme Court uphold this?

 A landmark judgment was delivered by the Supreme Court in 1992. That judgment is a judgment on reservations. The judgment was related to reservation in jobs as well as reservation in educational institutions. What is the case called?


 What is the verdict given by the Supreme Court in that case? — It has been said that the reservation should not exceed 50% of the total number of vacancies. This is from 1992. It has been going on ever since.


And in the year 2019, the Indian Parliament made a constitutional amendment. After the state assemblies also approved the constitutional amendment, it was given a legal form. When there is a constitutional amendment, when it is subject to federation, after it is approved by a special majority in both the houses of the Parliament, if at least half of the existing states, i.e. not less than half of the states, approve it by a simple majority... Then after the assent of the President, then the Constitution Amendment Bill becomes a Constitution Amendment Act. That is Constitutional Amendment 103. So we call it the 103rd Constitutional Amendment.


 Who has been given reservation by the 103rd constitutional amendment?


According to it, 10% reservation has been provided for EWS (Economically Weaker Sections).

  1. Here there is reservation for SCs,

  2. STs have,

  3. And so it is for other backward classes.


This constitutional amendment was done with the intention of providing a 10% reservation to the economically backward sections in the general category/open category instead of those who already have reservation.


Thus, in the year 1992, the Supreme Court broke the ceiling of not exceeding 50% and moved forward. Keeping that in mind, when this constitutional amendment was challenged in the Supreme Court, it was reported to the Constitutional Bench of the Supreme Court.


This constitution bench consists of a minimum of 5 judges. A five-judge bench delivered its verdict on November 7, 2022. It was 3:2 — that is, three judges ruled that the 103rd Amendment was constitutional.


So that the obstacles related to this reservation will be completely removed.. and this 10% reservation will be implemented for EWS. Already it is running. We should feel that it will go ahead without any obstacles.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు