Which was the first state/UT in India to become the first 'Swachh Sujal Pradesh'?


 ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుందాం. ఇది ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్.


Q: 'స్వచ్ఛ భారత్ మిషన్'కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి.

  1. ఇది అక్టోబర్ 31, 2014న ప్రారంభించబడింది. ❌️

  2. భారతదేశం ఇప్పుడు బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందిన తర్వాత ODF + మరియు ODF ++ వైపు పయనిస్తోంది.

  3. 2020 సంవత్సరంలో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ఫలితంగా 44 శాతం కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు నీటి సరఫరాను కలిగి ఉన్నాయి.

  4. అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశం యొక్క మొదటి 'స్వచ్చ సుజల్ ప్రదేశ్ '


దిగువ నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ మరియు బి ❌️

  2. బి మరియు సి ❌️

  3. సి మరియు డి ❌️

  4. బి మరియు డి ✅️



Explanation:

👉 Option A (ఇది అక్టోబర్ 31, 2014న ప్రారంభించబడింది) అనేది ఎందుకు కరెక్ట్ కాదు? ❌️

  • ఎందుకు అంటే స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించబడినది 2014 వ సంవత్సరం అయినప్పటికీని… దీనిని ప్రారంభించిన తేదీ మాత్రం అక్టోబర్ 2. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని.. ఆ ప్రత్యేక దినమున ఈ ప్రోగ్రామును ప్రారంభించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ A అనేది రాంగ్. ❌️


👉 Option B (భారతదేశం ఇప్పుడు బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందిన తర్వాత ODF + మరియు ODF ++ వైపు పయనిస్తోంది) అనేది ఎందుకు కరెక్ట్? ✅️

  •  అంటే ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ చక్కగా అమలు చేయబడుతూ.. ఈ బహిరంగ మల విసర్జన అనే దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాము. ODF (open defecation free).

  •  అందుకనే చూడండి మనం మన రాష్ట్రాలలో కూడా చూసుకుంటే కొన్ని గ్రామాలు కానీ కొన్ని మండలాలు గానీ అక్కడ కొన్ని నియోజకవర్గాలు కూడా అక్కడ ఒక ప్రకంపన అనేది వస్తుంది. బహిరంగ మల విసర్జన మా దగ్గర లేదు అని ఆయా నియోజకవర్గాలు చెబుతున్నాయి. మా ఊరిలో లేదా మా నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్స్ కట్టుకున్నాము వాటిని చక్కగా ఉపయోగిస్తున్నాము అని చెప్పుకోవడం. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ✅️


👉 Option C (2020 సంవత్సరంలో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ఫలితంగా 44 శాతం కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు నీటి సరఫరాను కలిగి ఉన్నాయి) అనేది ఎందుకు కరెక్ట్ కాదు? ❌️

  • జల్ జీవన్ మిషన్ అంటే ఏమిటి? ప్రతి ఇంటికి టాప్ ద్వారా త్రాగు నీటిని కల్పించే ఉద్దేశంతో ప్రారంభించబడిన ప్రోగ్రామే – జల్ జీవన్ మిషన్.

  •  ఇక దాని ద్వారా ప్రస్తుతం గ్రామ ప్రాంతాలలో గనుక చూసుకుంటే 44% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు ఈ నల్ల ద్వారా నీటి సరఫరాను పొందుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్.

  •  అయితే ఈ జల జీవన్ మిషన్ ను ప్రారంభించినది 2020 యేనా? అంటే అది తప్పు. ఇక్కడ 2020 అని ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ C అనేది తప్పు. మరి ఎప్పుడు ప్రారంభించారు? 2019లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ C అనేది తప్పు. ❌️


👉 Option D (అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశం యొక్క మొదటి 'స్వచ్చ సుజల్ ప్రదేశ్ ') అనేది ఎందుకు కరెక్ట్? ✅️

  •  ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశం యొక్క మొదటి 'స్వచ్చ సుజల్ ప్రదేశ్.

  • అండమాన్ మరియు నికోబార్ దీవులను ఈ విధంగా గుర్తించడం జరిగింది. దానికి అర్థం ఏమిటి అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉన్న ఈ 63 వేలకు పైగా ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా, అలాగే ప్రతి స్కూలుకు కూడా, ప్రతి ఆఫీసుకు కూడా – ఇప్పుడు నల్ల ద్వారా మంచినీటి సౌకర్యం అనేది 100% వస్తుంది. కాబట్టి ఆప్షన్ D అనేది కరెక్ట్. ✅️


Q: భారతదేశం యొక్క మొదటి 'స్వచ్చ సుజల్ ప్రదేశ్' ఏది? 📌📌

  • అండమాన్ మరియు నికోబార్ దీవులు


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)