Header Ads Widget

Responsive Advertisement

భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే ఏమిటి? ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? (DEC , 2022 Current Affairs)

 


ఇప్పుడు మనం Public Interest Litigation -PLT ( ప్రజా ప్రయోజన వ్యాజ్యం) అంటే ఏమిటి అనేది మనం కొన్ని పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామినేషన్ పరంగా మనకు కావలసింది ఏమిటి అంటే?


👉 ఈ Public Interest Litigation అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ లో పేర్కొనబడి ఉంది?

  •  దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఇది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ❌️


👉 పోనీ ఏదైనా చట్ట రూపంలో ఉందా?

  •  ఆ చట్ట రూపంలో కూడా లేదు ❌️


☑️ ఈ Public Interest Litigation అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో పేర్కొనబడకుండా అదే విధంగా చట్ట రూపంలో లేకుండా ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది?

 రాజ్యాంగంలో పేర్కొనబడకుండా అదే విధంగా చట్ట రూపంలో లేకుండా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే?

  •  1979 సంవత్సరం చివరిలోనూ.. 1980s ముందులో మనకు కాన్సెప్ట్ బాగా డెవలప్ అయ్యి.. 1980 నుండి ఈ Public Interest Litigation అనే కాన్సెప్ట్ విరివిగా ప్రజలలో వాడటం జరుగుతుంది. 📌


 అయితే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పరంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే? ఈ ప్రశ్నను గతంలో అడిగారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అడిగిన ఒక ప్రశ్న ఏమిటి అంటే?

Q: భారతదేశంలో Public Interest Litigation ప్రవేశపెట్టినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

  •  జస్టిస్ పిఎన్ భగవతి


వారు ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ జీకే పరంగా ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం. ఇలాంటి ప్రశ్నలు అన్నిటిని కూడా ఎగ్జామ్లో జీకే రూపంలో అడిగే అవకాశం ఉంది.


అయితే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది మనకు నిరంతరం వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అది ఇప్పుడు కూడా మనకు కనిపించింది. చూడండి మన భారతదేశము అదేవిధంగా రాజ్యాంగము ప్రకారంగా India is a secular state. మనం ఏదో ఒక మతమని కాకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాము. అలాగే ప్రభుత్వము కూడా అన్ని మతాలకు సంబంధించి సమాన దూరాన్ని పాటిస్తుంది అనే విషయము మనం రాజ్యాంగం చదివేటప్పుడు బాగా నేర్చుకుంటాము. అంతేగాని ఇక్కడ ఒక వ్యక్తిని పట్టుకుని ఫలానా మతాన్ని మాత్రమే ఆచరించాలి అని ఆ నిర్ణయం తీసుకునే అధికారం భారతదేశంలో ఎవ్వరికీ లేదు. ❌️


☑️ ప్రస్తుతం వార్తల్లో కనిపించే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమిటి?

 ఇటువంటి పరిస్థితులలో సుప్రీంకోర్టుకు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది. దాని ప్రకారంగా పిటిషనర్ ఏం అడిగాడు అంటే? వాళ్ల శక్తికి సంబంధించిన అనగా వాళ్ల గ్రూపుకు సంబంధించిన ఆ రిలీజియస్ లీడర్ ఎవరైతే ఉంటారో.. ఆయనను పరమాత్ముడిగా గుర్తించాలి. Spiritual being గా గుర్తించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని ఆ విధంగా గౌరవించాలి అని చేసేటట్టుగా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇవ్వండి అని ఒక వినతి పత్రం.


 కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా స్పందించి,..

  • రాజ్యాంగంలో సెక్యులరిజం అంటే ఏమిటి? ఆ కాన్సెప్ట్ గురించి చెబుతూ.. ఆ వ్యక్తి మధ్యలో జోక్యం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చి ఇక అనవసరమైన ఒక పిటిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు గాను.. ఆ వ్యక్తికి జరిమానా అంటూ విధించడం జరిగింది. దీనినే Exemplary cost అంటారు.


☑️ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి?

 ఎందుకంటే మామూలుగా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టడానికి కారణం మరియు ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే?

  •  అత్యంత ముఖ్యమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకుని వస్తే కోర్టు వెంటనే ఆ విషయానికి సంబంధించి ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.


అలాకాకుండా అంతటి ముఖ్యమైన అంశాలను పెట్టుకుని అటువంటి దానిలో మీరు Trivial matters మీరు తీసుకుని వచ్చి, ఎవరికి ఉపయోగపడని కొన్ని మ్యాటర్స్ తీసుకొని వచ్చి దానిమీద ఆర్డర్ ఇవ్వండి అని కోర్టులో పిటీషన్ పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఆ వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా విధించడం జరిగింది.


 దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి కోర్టు సమయం అనేది చాలా అమూల్యమైనది. వృధా చేస్తే అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో వస్తే.. మనం చాలా సార్లు చూసాము. ఇటువంటి Exemplary cost అనే పనిష్మెంట్ అటువంటి జరిమానా అంటూ విదించడం జరుగుతుంది. 





Also read in English:

In which year Public Interest Litigation was introduced in India?

Now let us try to know some points about what is Public Interest Litigation -PLT. What do we need in terms of examination?


👉 The concept of Public Interest Litigation is mentioned in which article of the Constitution?

  •  Please remember this is not mentioned in the constitution. ❌


👉 Is the Public Interest Litigation is in any legal form?

  •  Not even in the form of that law ❌


☑️ How did this concept of Public Interest Litigation come about without being mentioned in the Constitution and also without the form of law?

How did this concept of Public Interest Litigation come about without being enshrined in the Constitution and likewise without the form of law?

  • At the end of the year 1979.. before the 1980s we have developed the concept well.. since 1980 this concept of Public Interest Litigation is widely used among people. 


 But what do we need to remember in terms of examination here? This question has been asked before. What is a question also asked in civil services prelims exam?

Q: Who was the Chief Justice of India when Public Interest Litigation was introduced in India?

  • Justice PN Bhagwati


He was the Chief Justice at that time. This is a point to always remember in terms of GK. All such questions are also likely to be asked in GK form in the exam.


But this public interest litigation is what we see constantly in the news. And so we see it now. Look, India is a secular state as per the constitution. We do not belong to any one religion but we respect all religions equally. Also we learn well when we read the constitution that the government also maintains an equal distance with respect to all religions. Moreover, no one in India has the authority to make a decision to hold a person here and practice only a particular religion. ❌


☑️ What Public Interest Litigation is currently in the news?

  • In such circumstances a Public Interest Litigation came to the Supreme Court. Accordingly, what did the petitioner ask? Whoever is that religious leader related to their power i.e. related to their group.. He should be recognized as divine. should be recognized as a spiritual being. A petition asking for an order from the Supreme Court that everyone in India should respect that person in that way.


So the Supreme Court responded very seriously in this matter,.. What is Secularism in the Constitution? Talking about that concept... When the person intervened in the middle, he expressed his anger on the person and brought an unnecessary petition and wasted the precious time of the Supreme Court here.. The person was fined. This is called Exemplary cost.


☑️ What is the main purpose of introducing the concept of Public Interest Litigation?

 Because what is the main purpose and reason for introducing this concept of Public Interest Litigation?

  • If the most important issues are brought to the court's attention, the court will immediately pass orders regarding the matter and give directions to the government.


Apart from that, the person was fined one lakh rupees for wasting the time of the court by filing a petition in the court saying that you have brought trivial matters with such important matters and put an order on it.


Please remember court time is precious. If it is wasted, it also comes in the form of public interest litigation.. We have seen it many times. Such punishment called Exemplary cost is called such fine.





Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు